బీసీ గురుకులాల్లో ప్రవేశానికి చివరి తేది ఎప్పుడంటే ?
1 min read
పల్లెవెలుగువెబ్ : తెలంగాణలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలోని ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కోర్సుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22 చివరి తేదీ అని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష జూన్ 5న నిర్వహిస్తామన్నారు. 6,7,8 తరగతుల్లో ప్రవేశాలకు జూన్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రవేశ పరీక్షకు http://mjptbcwreis.telan-gana.-go-v.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.