మిడుతూర్ ఎత్తిపోతల పథకం ఎప్పుడు.?
1 min read
రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలిప్రభుత్వాలు మారుతున్నా అందరినీ నీళ్లు
ప్రజా సంఘాల నాయకులు ధర్నా..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు :ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేలు మారుతూ ఉన్నా మిడుతూరు మండలానికి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు నీళ్లు అందడం లేదని ప్రజా సంఘాల నాయకులు నంద్యాల జిల్లా మిడుతూరు మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా సీపీ ఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు పి వెంకటేశ్వర్లు, సిపిఐయు జిల్లా కన్వీనర్ లాజరస్,మర్రిస్వామి,న్యూ డెమోక్రసీ నవీన్ మరియు రైతులతో కలిసి ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో మిడుతూరు మండలం మెట్ట భూములకు హంద్రీనీవా లిఫ్ట్ ద్వారా నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాలు మారినా ప్రజా ప్రతినిధులు మారినా నియోజకవర్గ రైతుల జీవితాలు మారడం లేదని మెట్ట ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని చుట్టూ నీరు ఉన్న రైతుల పొలాలు పండించుకునే పరిస్థితి లేదని విమర్శించారు.ముఖ్యమంత్రి ఎన్నికల హామీల్లో భాగంగా నందికొట్కూరు పటేల్ సెంటర్లో బహిరంగ సభలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే ఎంపీలను గెలిపిస్తే తక్షణమే మిడుతూరు మండలానికి రైతాంగానికి సాగునీటి తాగు నీటికి ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని దానిని నేటి పాలకులు తీర్మానాలు చేస్తున్నాం ముఖ్యమంత్రిని కలిసిన వినతి పత్రాలు ఇచ్ఛామని చెప్పడమే తప్పా నిధులు మంజూరు చేయించడం లేదన్నారు గత ప్రభుత్వంలో అలగనూరు రిజర్వాయర్ గండిపడినా నిధులు కేటాయించక పోవడంతో నిర్వీర్య మైపోయిందని అన్నారు.మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అలగనూరు రిజర్వాయర్ విధులు కేటాయిస్తామని గొప్పలు చెప్పినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు ఆ వైపు నిధులు మంజూరు చేయడం లేదన్నారు. రైతాంగానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు అందించాలని లేనిపక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని అన్నారు.తర్వాత తహసిల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు శ్రీనివాసులు,డక్కా కుమార్ వేల్పుల ఏసన్న,నర్సింహులు మరియు రైతులు పాల్గొన్నారు.