విస్కీ బాటిల్ ధర రూ. 4.14 కోట్లు !
1 min readపల్లెవెలుగువెబ్ : ది యమజాకి విస్కీ రికార్డు ధర పలికింది. ఈ విస్కీని జపాన్‌కి చెందిన లిక్కర్ తయారీ సంస్థ సుంటోరీ తయారు చేసింది. ఎనిమిది మంది ఈ అరుదైన విస్కీని సొంతం చేసుకునేందుకు పోటీ పడగా చివరకు చైనాకు చెందిన ఓ ప్రయాణికుడు రికార్డు స్థాయిలో రూ.4.14 కోట్లు చెల్లించి ఈ విస్కీని దక్కించుకున్నాడు. ఈ మేరకు ఎయిర్పోర్ట్ వరల్డ్ కథనం ప్రచురించింది.1960లో మూడు అరుదైన రకాలకు చెందిన సింగిల్ మాల్ట్ విస్కీలను బ్లెండ్ చేసి యమజాకీ స్కాచ్‌ని తయారు చేశారని ఆ కంపెనీ చీఫ్ బ్లెండర్ షింజిరో ఫికియో తెలిపారు. ఈ స్కాచ్ గురించి ఆయన చెబుతూ.. ఇదొక అందమైన గ్రీకు శిల్పం వంటిదన్నారు. సుంటోరీ సంస్థ అరుదైన రకానికి చెందిన విస్కీని తయారు చేసి లిమిలెడ్‌గా మార్కెట్లోకి తెస్తుంది. ప్రత్యేకమైన వ్యక్తులకే వాటిని సరఫరా చేస్తూ ఉంటుంది.