వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు ఎవరికంటే ?
1 min read
పల్లెవెలుగువెబ్ : సోషల్ మీడియా పటిష్టతపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియా బాధ్యతలు చూడటానికి తెరపైకి కొత్త పేరు వచ్చింది. సజ్జల తనయుడు సజ్జల భార్గవరెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ ఆధ్వర్యంలో భార్గవ్, సోషల్ మీడియా వింగ్ నేతలు భేటీ అయ్యారు. సోషల్ మీడియాతో పాటు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతను ఇప్పటి వరకూ విజయసాయిరెడ్డి చూస్తూ వస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాల దాడి, ఆరోపణలు పెరుగుతుండడంతో కౌంటర్ స్ట్రాటజీ టీమ్ అవసరమని సీఎం జగన్ భావిస్తున్నారు.