NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌న సినిమాలు అక్క‌డ‌ ఎందుకు హిట్ కొడుతున్నాయంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ద‌క్షిణాది చిత్రాలు బాలీవుడ్ లో బాగా ఆడుతాయి, కానీ హిందీ చిత్రాలు ద‌క్షిణాదిలో ఆడ‌వు అని ప్ర‌ముఖ హీరో స‌ల్మాన్ ఖాన్ అభిప్రాయ‌ప‌డ్డారు. దీనికి కేజీఎఫ్‌ హీరో యశ్‌ సరైన సమాధానమిచ్చాడు. ‘సల్మాన్‌ ఖాన్‌ అభిప్రాయం తప్పు. చాలాకాలంగా ఇ‍క్కడి సినిమాలను హిందీలో డబ్‌ చేసి వదులుతున్నారు. దీంతో రానురానూ సౌత్‌ కంటెంట్‌ హిందీ ప్రేక్షకులకు చేరువైంది. మొదట్లో ఇదో జోక్‌గా ప్రారంభమైనా ఆడియన్స్‌ ఇది ఏ ప్రాంతానికి చెందిన సినిమా అని పెద్దగా పట్టించుకోలేదు. కొన్నేళ్లుగా ఇది కొనసాగుతూ ఉండటంతో వారు ఇక్కడి పద్ధతులను అర్థం చేసుకున్నారు. అది మాకిప్పుడు ఉపయోగపడింది. రాజమౌళి బాహుబలిని డైరెక్ట్‌గా రిలీజ్‌ చేశారు. కేజీఎఫ్‌ విషయంలో మేమూ అదే ఫాలో అయ్యాం. అది మా బిజినెస్‌కు ఉపయోగపడింది’ అని చెప్పుకొచ్చాడు.

                                

About Author