NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దళితులు జగనన్నను ఎందుకు నమ్మాలి

1 min read

– దళితాభ్యుదయం తెలుగు దేశం తోనే సాధ్యం
– శ్రీశైలం నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి నాగరత్నం
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు : నాలుగేళ్ల జగనన్న పాలనలో దళితుల పై హత్యలు,అత్యాచారాలు,దళిత భూముల కబ్జా లు తప్ప ఒరిగింది ఏమి లేదని దళితులు జగనన్నను ఎందుకు నమ్మాలి శ్రీశైలం నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి నాగరత్నం ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ హత్య మొదలుకొని నేడు అచ్చన్న హత్య వరకు 9 మంది దళిత బిడ్డలను వైసిపి ప్రభుత్వం బలి తీసుకుంది. సుమారు 50 వేల కోట్లు రూపాయల ఎస్సీ నిధులను దారి మళ్లించి దళితులకు మొండి చెయ్యి చూపించారని,ఒక్క రూపాయి కూడా దళిత కాలనీల అభివృద్ది కోసం నిధులు కేటాయించిన దాఖలాలు లేవని అన్నారు. జగనన్న సి ఎం కావడం కోసం దళిత యువకుడి శ్రీను తో కోడి కత్తి డ్రామా ఆడించి నాలుగేళ్లుగా జైలు పాలు చేసిన జగన్ మోహన్ రెడ్డి ని దళితులు నమ్మే స్థితిలో లేరని అన్నారు.దళిత అభ్యుదయం తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తోనే సాధ్యం దళితుల సంక్షేమం కోసం తెలుగు దేశం 28 సంక్షేమ పథకాలను అమలు చేసి ఆర్థికంగా బలోపేతం చేశారని తెలిపారు.శ్రీశైలం నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హయాంలో దలితకాలనీలలో అభివృద్ది జరిగిందనీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు.అంబేడ్కర్ విదేశీ విద్య పథకాన్ని పథకం ద్వారా దళితులు ఉన్నత విద్య ను అందించిన ఘనత బుడ్డా రాజశేఖర్ రెడ్డి కే దక్కిందని పేర్కొన్నారు. పక్క గృహాలు వృద్ధాప్య వితంతు వివాహాలకు బుడ్డా రాజశేఖర్ రెడ్డి సేవలను దళితులు మరువలేని తెలిపారు.దలితులార మన ఆన్న తమ్ములను చంపి వేసిన వైసిపి నీ ఓడించి గుణ పాఠం చెప్పాలంటే అది తెలుగు దేశం పార్టీ తోనే సాధ్యం అని చెప్పారు.

About Author