PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాక్సిన్ వేసుకున్నాక జ్వరం ఎందుకొస్తోంది ?

1 min read

పల్లెవెలుగు వెబ్: క‌రోన వ్యాక్సిన్ వేయించుకున్నాక చాలామందిలో జ్వరం, త‌ల‌నొప్పి, ఒళ్లునొప్పులు లాంటి ల‌క్షాణాలు క‌నిపిస్తాయి. ఈ ల‌క్షణాలు క‌రోన వ్యాక్సిన్ వేసుకుంటేనే వ‌స్తున్నాయ‌న్న అపోహ చాలా మందిలో ఉంది. వ్యాక్సిన్ తీసుకున్నాక ఇలాంటి ల‌క్షణాలు క‌నిపించ‌డం సాధార‌ణ‌మ‌ని వైద్యులు చెబుతున్నారు. మ‌న రోగ‌నిరోధ‌క వ్యవ‌స్థ ఉత్తేజిత‌మ‌వుతోంద‌ని చెప్పడానికి ఇదొక సంకేత‌మ‌ని వైద్యులు అంటున్నారు. మ‌న రోగ నిరోధ‌క వ్యవ‌స్థలో రెండు భాగాలు ఉంటాయి. ఒక‌టి స‌హ‌జ వ్యవ‌స్థ. రెండోది స‌ముపార్జిత వ్యవ‌స్థ. మ‌న శ‌రీరంలోకి ఏదైన ప్రవేశించిన వెంట‌నే స‌హ‌జ వ్యవ‌స్థ ప్రతిస్పందించి .. ప్రతి చ‌ర్య మొద‌లుపెడుతుంది. మ‌నం క‌రోన టీకా వేసుకోగానే .. తెల్ల ర‌క్తక‌ణాలు ఆ ప్రాంతానికి చేరుకుని ప్రక్రియ ప్రారంభిస్తాయి. దాని ఫ‌లితంగా తిమ్మిర్లు, ఒళ్లు నొప్పులు , అల‌స‌ట లాంటి ల‌క్షణాలు క‌నిపిస్తాయి. మ‌న రోగ‌నిరోధ‌క వ్యవ‌స్థలోని రాపిడ్ రెస్పాన్స్ ప్రక్రియ వ‌య‌సును బ‌ట్టి క్షీణిస్తుంది. అందుకే వ్యాక్సిన్ వేసుకోగానే య‌వకుల్లో జ్వరం, ఒళ్లునొప్పులు, అల‌స‌ట లాంటి ల‌క్షణాలు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. వృద్ధుల్లో వ్యాక్సిన్ వేసుకున్నా తర్వాత ఇలాంటి ల‌క్షణాలు త‌క్కువ‌గా క‌నిపిస్తాయి.

About Author