బాలీవుడ్ ఎందుకు వెనకబడుతుందంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ నటి రవీనా టాండన్ ఒకప్పటి బాలీవుడ్‌ని, సౌత్ సినిమాని కూడా పోలుస్తూ తేడాని వివరించింది. హిందీ సినిమా దర్శకనిర్మాతలు వీలైనంతగా హాలీవుడ్‌ను అనుకరించటంలోనే నిమగ్నమయ్యే వారట. అదే సమయంలో రవీనా దక్షిణాది చిత్రాలు చేసేందుకు మన వైపుగా వస్తే… ఇక్కడి చిత్రాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు తెర నిండుగా దర్శనం ఇచ్చేవట! ఆ విధంగా సౌత్ మూవీస్ సామాన్యులకి ఏం కావాలో అది అందించటం వల్లే సూపర్ హిట్స్ అయ్యాయని రవీనా విశ్లేషించింది.