PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధిష్టానం నిర్ణయానికే.. కట్టుబడి ఉంటా..!

1 min read

–2024లో వైసీపీ టికెట్ ఎవరికి ఇచ్చిన సంతోషమే..

 వైసీపీ  గెలుపు కోసం పనిచేస్తా.. :నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు:వైసీపీ పార్టీ అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటానని  వచ్చే  2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా  నందికొట్కూరు అసెంబ్లీ టికెట్ ఎవరికి వచ్చిన పార్టీ గెలుపు కోసం  పనిచేస్తానని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన  మహా సంకల్ప పాదయాత్ర నేటికి ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని బ్రహ్మణకొట్కూరు, నందికొట్కూరు లోని దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ  కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు బాలింతలకు పండ్లు ,బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 అసెంబ్లీ ఎన్నికలలో 41 వేల ఓట్ల భారీ మెజారిటీతో ప్రజలు తనను గెలిపించారని నియోజకవర్గాని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకోవడానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతులు మంజూరు కోసం పంపడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసి నియోజకవర్గ  అభివృద్ధి పనులపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని నియోజకవర్గ పరిధిలో మిడుతూరు, కొత్తపల్లి మండలాల్లో ఎత్తిపోతల పథకం, నందికొట్కూరు లో ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటు, నియోజకవర్గం లోని వివిధ గ్రామాలలో రహదారుల నిర్మాణం, చెక్ డ్యాం ల నిర్మాణం,కోల్స్ ఆనందాపురం గ్రామంలో కేసి కాలువ వంతెన నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. ఎత్తిపోతల పధకం ద్వారా చెరువులకు నీటి విడుదల కోసం ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. రాష్ట్రంలో పేదరికాన్ని పారదోలేందుకు సీఎం జగన్ నవరత్నాల పథకాలును అమలుచేస్తున్నారన్నారు.తన పాదయాత్రలో ప్రజల కష్టాలును కళ్లారా చూసి రెండు పేజీల మ్యానిఫెస్టో ను పెట్టి, అధికారం చేపట్టిన వెంటనే వాటి అమలుకు శ్రీకారం చుట్టారన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో  సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.మూడేళ్ళ పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలును  సంక్షేమ బావుటా పేరుతో కరపత్రంను ధైర్యంగా అందిస్తున్నామన్నారు.మైనారిటీ, ఎస్ సి, ఎస్ టి , బిసి లకు సంక్షేమ పథకాలు  అందడం లేదని కొందరు విమర్శలు చేస్తున్నారని, జగన్ పాలన లో అర్హత కలిగిన కుటుంభం లబ్దిపొందడం జరిగిందన్నారు..తన పాలనలో ప్రజలకు మేలు జరిగిఉంటే గుండెలపై చేయి వేసుకుని తనకు  అండగా నిలవాలని ప్రజలను కోరిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని తెలిపారు.  పారదర్శకంగా, అవినీతి రహితంగా జగన్ పాలన సాగుతోందన్నారు.రూ 2 లక్షల కోట్ల నిధులను వివిధ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా అందించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు.ఇది పేదలు, రైతుల  సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వమన్నారు.రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, నాడు నేడుతో కార్పోరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి జరుగుతొందన్నారు.కుటుంబం  కంటే నా నియోజక వర్గ ప్రజలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని, మీ బిడ్డగా తోడుంటానన్నారు. రాజకీయాలలో  పదవులు వస్తుంటాయి.. పోతుంటాయని, ప్రజల హృదయాలలో స్తానం సంపాదించుకోవాలని ,ఎదిగే కొద్దీ ఒదిగి ఉండి, ప్రజలకు మంచి చేసి నప్పుడే ఆ పదవికి సార్ధకత ఉంటుందని  తెలిపారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్  హాజీ అబ్దుల్ సుకూర్ , రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్  గంగిరెడ్డి రమాదేవి , రాష్ట్ర రైతు సంఘం ఉపాద్యక్షులు  వంగాల. సిద్దా రెడ్డి ,  నందికొట్కూరు మున్సిపల్  వైస్ చైర్మన్  మొల్ల రబ్బానీ , మున్సిపల్ కౌన్సిలర్లు  ఉండవల్లి ధర్మారెడ్డి , మొల్ల జాకీర్ , నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ సగినేల  ఉసేనయ్య , బ్రాహ్మణ కొట్కూరు సింగిల్ విండో చైర్మన్ మాద్దురు హరి సర్వోత్తమ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ చందమాల బాలస్వామి,  పట్టణ వైసీపీ మహళా నాయకురాలు  వనజ , వైసీపీ నాయకులు తమ్మడపల్లి   విక్టర్,పెరుమాళ్ళ జాన్ , ముజీబ్, ప్రవీణ్, భాస్కర్, వెంకట స్వామి, వలి, భాస్కర్ రెడ్డి, తిమ్మాపురం నాగన్న, పానుగంటి ,గోపాల్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వెంకటసుబ్బయ్య, అశోక్ రెడ్డి, ఇనాయతుల్లా, హనుమంత రెడ్డి, దామగట్ల  రత్నం, సంజన్న, నాగభూషణం గౌడ్, బ్రాహ్మణ కొట్కూరు ఉదయ్ కిరణ్ రెడ్డి, రఘునాధ రెడ్డి, భాష, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author