NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గోల్డ్ మెడల్ సాధించడం  కర్నూలు జిల్లాకు గర్వకారణం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  37 వ రాష్ట్రస్థాయీ కిక్ బాక్సింగ్ పోటీలు విశాఖపట్నంలోని ఏయూ యూనివర్సిటీలో జరిగాయి. ఇందులో ఎనిమిది జిల్లాల వాళ్లు పాల్గొనగా రెండువందల అరవై మంది బాల, బాలికలు పోటీపడ్డారు. అందులో కర్నూలుకి చెందిన పెరుమల కౌశిక్ పాయింట్ ఫైట్ ఈవెంట్ మైనస్ 40 కేజీ విభాగంలో గోల్డ్ మెడల్ మరియు అబి రాఘవ పాయింట్ ఫైట్ ఈవెంట్ కేజీ విభాగంలో మైనస్ 37 కేజీ దాంట్లో సిల్వర్ మెడల్ మరియు సారా ప్రశస్తా మ్యూజికల్ ఫామ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. ఇది కర్నూలు జిల్లాకు మంచి గర్వకారణం ఈ విషయాన్ని స్టేట్ సెక్రటరీ అయిన నరేంద్రాచారి  తెలియజేశారు.

About Author