ఎమ్మెల్యే సహకారంతో ..ఆ పాఠశాలకు రిపబ్లిక్ డే
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సహాయ సహకారాలతో ఆ పాఠశాలకు రిపబ్లిక్ డే వచ్చేసింది. వివరాల్లోకి వెళితే మహానంది మండలం గాజులపల్లె ఆర్ఎస్ నందు ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏకో ఉపాధ్యాయ పాఠశాల గత ఆరు నెలల నుంచి మూతపడి ఉంది. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను పక్క పాఠశాలకు బదిలీ చేశారు. అయితే అక్కడ ఇబ్బందులు తలెత్తడంతో ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి చొరవ తీసుకొని అక్కడికి ఒక ఉపాధ్యాయుడిని వేయించడంతో ఆ పాఠశాల గురువారం తిరిగి ప్రారంభించడం జరిగింది. రిపబ్లిక్ డే రోజా ప్రారంభించడం రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఎగరవేయడం ఏకకాలంలో జరిగింది. ఐ టి డబ్ల్యూ పిడి రాజశేఖర్ రెడ్డి నంద్యాల డిస్టిక్ పైపర్ వెల్ఫేర్ అధికారి హుస్సేనయ్యా విద్యార్థులు పడుతున్న కష్టాలను గుర్తించి తిరిగి పునః ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నారు.