చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.. జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లాలో PC & PNDT చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.బుధవారం కలెక్టరేట్ లో PC&PNDT కి సంబంధించిన జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. స్కానింగ్ సెంటర్లపై నిరంతర నిఘా ఉంచాలని, గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.. తదనంతరం జిల్లా స్థాయి సలహా కమిటీ 2 కొత్త స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్లకు, 8 స్కానింగ్ కేంద్రాలు రెన్యువల్ కు, 07 మోడిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా సంబంధిత వాటన్నింటికి ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.. సమావేశంలో 7వ అదనపు జిల్లా జడ్జి లక్ష్మి రాజ్యం, డిఎంహెచ్ఓ డా.కామేశ్వర ప్రసాద్, NGO ప్రతినిధి డా.బాలమద్దయ్య, ఎస్ఓ హేమ సుందరం, డెమో ప్రకాశ్, డిప్యూటీ డెమో షఫీ ఉన్నిష తదితరులు పాల్గొన్నారు.


