PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్ని రంగాలలో మహిళలు విజయం సాధిస్తున్నారు

1 min read

– మంచి నడవడికతోనే అగ్రస్థానం..ఎంపీపీ పెన్మత్స శ్రీనివాసరాజు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఏలూరు ఎంపీపీ పెన్మత్స శ్రీనివాసరాజు దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలుస్తున్నారని ప్రతి పురుషుడి వెనక స్త్రీ మూర్తి నిలబడి తన విజయానికి నాంది పలుకుతుందని అన్నారు. చరిత్ర కాలాల నుంచి మహిళలు నిరూపించడం జరుగుతుందని అన్నారు. మనకు తెలిసి మన దేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ ఒక మహిళగా దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించారని అది ప్రతి ఒక్కరికి తెలుసని ఆమె ధైర్య సాహసాలు వీరోచత పోరాటం రాజకీయ పరిపాలన ప్రపంచ దేశాలు కూడా ప్రశంసించేయని అన్నారు. ప్రతి పురుషుడు తన దినచర్యలో భాగంగా కొంత సమయాన్ని కేటాయించి శ్రమిస్తే ప్రతి మహిళ ఉదయం నిద్ర మేల్కొంన్న సమయం నుండి మళ్లీ రాత్రి నిద్రించే సమయం వరకు తన కుటుంబానికి. తన విధులలో శ్రమని లెక్కచేయకుండా ఎంతో ఉత్సాహంతో తన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అదే గొప్ప గర్వకారణం అని కొనియాడారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆంక్షలు లేని స్వేచ్ఛను ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని అందించాలన్నారు. ఎంపీడీవో గా పని చేస్తున్న డాక్టర్ బి ప్రణవి ఒక మహిళగా గ్రూప్ వన్ సాధించటం ఎంతో గర్వకారణమని. ఆమె పట్టుదల కృషి ఒక ఎతైయితే మరియు వారి తల్లిదండ్రుల ఒక మహిళకు స్వేచ్ఛ ఇవ్వడం తోనే ఇoతటి విజయాన్ని సాధించడం సాధ్యమైందన్నారు. మన మండల పరిషత్తులో పనిచేసే ప్రతి మహిళలకు అందరికీ స్ఫూర్తిదాయకమని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తమ పిల్లల భవిష్యత్తునికి అంచలంచలుగా మార్గదర్శకాలు వెయ్యాలని సూచించారు. ప్రణవిని ఆమె తల్లిదండ్రులను ఆమెతో పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి మెమోటో తో ముగ్గురిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షకులుగా జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ ఆర్ జి ఎస్) ఏపీవో పి కిషోర్ పరిరక్షిస్తూ నిర్వహించారు. వారి సిబ్బందికి ప్రభుత్వ పరంగా వారు చేస్తున్న సేవలను గుర్తించి ఎంపీపీ దంపతులు మహిళా దినోత్సవ సందర్భంగా నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మండల ఎంఈఓ సబ్బిత నరసింహారావు వ్యాఖ్యాతగా మహిళల ఔనుత్యాన్ని చాటుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఈవో పి ఆర్ డి సరళ కుమారి, ఏవో వై సుజాత. హౌసింగ్ ఏ ఇ శ్రీనివాసరావు, పరిషత్ కార్యాలయ సిబ్బంది మరియు ఎన్ఆర్ జీ ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రేమపూర్వక విందును ఏర్పాటు చేశారు.

About Author