NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళా సాధికారత దేశ అభివృద్ధికి చిహ్నం

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ : యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బివి శ్రీనివాస్  ఏఐసిసి జాయింట్ సెక్రెటరీ యువజన కాంగ్రెస్ నేషనల్ ఇంచార్జ్ కృష్ణ అల్వారు  మరియు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు  ఆదేశాల మేరకు విజయవాడ యువజన కాంగ్రెస్ స్టేట్ ఆఫీస్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తోడేటి సందీప్ ఐశ్వర్ గారు మాట్లాడుతూ దేశ అభివృద్ధి మహిళా సాధికారత తోనే సాధ్యమని అన్నారు జూలై 28న బెంగళూరు నందు జరిగిన బెతర్ భారత్ బునియాడి  నేషనల్ యూత్ కన్వెన్షన్ లో *శక్తి సూపర్ షి* అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళ సాధికారత ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం ఉంటుందని యువజన కాంగ్రెస్ 33 శాతం మహిళలకు స్థానం కేటాయించడం జరిగిందని అన్నారు అలాగే రానున్న రోజుల్లో యువజన కాంగ్రెస్ లో మహిళలకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు బిజెపి పరిపాలనలో మహిళలను చాలా చిన్నచూపు చూసే పరిస్థితి కనపడుతుందని మణుపూర్ లో మహిళలపై జరిగిన ఘటన దానికి ఉదాహరణ అని ఆయన అన్నారు భారతీయ స్వతంత్ర దినోత్సవం  నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీలో ప్రతి మండలాల్లో మహిళల చేసే జెండా ఆవిష్కరణ చేపట్టాలని యువజన కాంగ్రెస్ పిలుపునిచ్చిందని తెలియజేశారు.  ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పీటర్ జోసెఫ్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు ఆదేశాల మేరకు ఆగస్టు 15న ఇండియా ఇండిపెండెన్స్ డే సందర్భంగా జిల్లాల వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ చేపట్టబోయే జెండా ఆవిష్కరణ కార్యక్రమం మహిళతోనే చేయనున్నారు అని తెలిపారు మహిళలను అవమానిస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల రెండిటిని 2024లో మహిళలు ఈ దేశం నుంచి  తరిమికోట్టపోతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు అండ్ ఆర్టిఐ జిల్లా అధ్యక్షులు టి కృష్ణ గారు, ప్రదీప్ కుమార్, జాన్, తదితరులు పాల్గొన్నారు.

About Author