మహిళలు విద్యతోనే అన్ని రంగాలలో రాణిస్తున్నారు..
1 min read– మహిళ రిజర్వేషన్లు కల్పనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు..
– జిల్లా మహిళా, నగర మహిళా అధ్యక్షువ్రాళ్లు..
– సాయిబాల పద్మావతి, నున్న స్వాతి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం స్థానిక జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సాయి బాల పద్మావతి మరియు ఏలూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు నున్న స్వాతి కిషోర్ ఏర్పాటు చేసిన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని, విద్యతో మరింత అభివృద్ధి సాధిస్తారని అన్నారు, మహిళలే ఎక్కువ శాతం అన్ని రంగాలలో పనిచేస్తున్నారని. అభివృద్ధి సాధిస్తున్నారని. చట్ట సభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్ద పీఠ వేశారని సీఎం జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు, ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఈ కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు సతీమణి ఝాన్సీ ,ఇడా చైర్మన్ ఈశ్వరి బలరాం, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి ఏలూరు కార్పొరేషన్ సభ్యురాలు నేత విజయకుమార్ జైన్, మహిళ కార్పొరేటర్లు జుజ్జువరపు విజయనిర్మల, ఇనపనురి కేదారేశ్వరి జగదీష్ , పిళ్ళo గోళ్ల శ్రీదేవి, ఆరేపల్లి రాధిక సత్తిబాబు, చిలకలపాటి డింపుల్ రిషి పలువురు మహిళ కార్పొరేటర్లు,కో-ఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ ని, నున్న స్వాతి కిషోర్, ని పార్టీకి సేవలు అందించిన పలువురు సీనియర్ మహిళా నాయకులను పుష్పగుచ్చాలి అందించి. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.