మహిళలు రాజకీయంగా ఎదగాలి
1 min read– ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించండి
– ఎన్డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్. హసీనాబేగం
పల్లెవెలుగు, కర్నూలు; మహిళలు రాజకీయంగా ఎదగాలని, అందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎన్డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్. హసీనాబేగం అన్నారు. శనివారం 15,47,48వ వార్డులలో బరిలో నిలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ఇస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని కోరారు. 15వ వార్డు అభ్యర్థి శవల మహదేవమ్మ, 47వ వార్డు జెరదొడ్డి నర్సమ్మ, 48వ వార్డు భాస్కరమ్మను గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఎస్.హసీనాబేగం మాట్లాడుతూ ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపిస్తే.. ఆయా వార్డుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. నేషనల్ ఉమెన్స్ పార్టీ తరుపున ప్రజలు, మహిళలకు అండగా ఉంటామన్నారు. 47వ వార్డు బ్రష్, 48వ వార్డు ఉంగరం, 15వ వార్డ్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి.. వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్డబ్ల్యూపీ మహిళా వింగ్ ప్రెసిడెంట్ ఎన్.మేరీ, కొత్తపేట ఇన్చార్జ్ ప్రసన్న ,యూత్ ప్రెసిడెంట్ ఇంతియాజ్ , మరియు కార్యకర్తలు విజయమ్మ, ఎస్.సుజాత, బి.సుజాత, పి.సురేఖ, సిమ్రాన్, అనిత పాల్గొన్నారు.