నేషనల్ డిఫెన్స్ ఆకాడమీ ప్రవేశానికి మహిళలను అనుమతివ్వాల్సిందే – సుప్రంకోర్టు
1 min readపల్లెవెలుగువెబ్, ఢిల్లీ: నవంబర్ 14న జరుగనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రవేవ పరీక్షల్లో మహిళలకు అనుమతివ్వాల్సిందేనంటూ సుప్రంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఇటీవల నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళల ప్రవేశాన్ని మరో ఏడాదిపాటు వాయిదా వేయాలన్న కేంద్రప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. స్త్రీ, పురుష సమానత్వం సాధించేందుకు వీలుగా సైన్యంలో మహిళలకూ ప్రవేశానుమతులు ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం సదరు ప్రక్రియకు మరో ఏడాది గడువు కోరింది. కాగా సర్వోన్నత న్యాయస్థానం అందుకు నిరాకరించింది.