NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ అధినేత‌కు స‌మ‌న్లు జారీ చేసిన మ‌హిళా క‌మీష‌న్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీనేత బొండా ఉమకు రాష్ట్ర మహిళా కమిషన్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను అగౌరవపరచడం.. బాధితురాలి ఆవేదన విననీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశార‌ని ఆరోప‌ణ ఎదుర్కొంటున్నారు. ఈనేప‌థ్యంలో అత్యాచార బాధితురాలిని భయకంపితం చేసిన సంఘటనలపై విచారణకు చంద్రబాబు, బొండా ఉమ వ్యక్తిగతంగా హాజరుకావాలని మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈనెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమ స్వయంగా విచారణకు కావాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సమన్లలో ఆదేశించారు.

                                     

About Author