క్షయవ్యాధి నివారణకు కృషి చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ చాగలమర్రి: గ్రామాల్లో క్షయ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్యులు అంజలి, ఇమ్రాన్లు తెలియజేశారు. చాగలమర్రి పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక వైద్యశాల పరిధిలో క్షయవ్యాధి మందులను వాడుతున్న 21 మందికి రూ.500ల విలువైన నిత్యవసర సరుకులను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిక్షయ మిత్రల ద్వారా 6నెలల పాటు క్షయ వ్యాధిగ్రస్తులకు నిత్యవసరాలను పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో సిహెచ్‌ఓ రమణమ్మ,హల్త్ ఎడ్యుకేటర్ వెంకటమ్మ. సూపర్వైజర్లు రామచంద్రుడు,సీతారాముడు,ప్రమీలమ్మ తదితరులు పాల్గొన్నారు.