PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ విజయవాడ: విజయ పాల డైరీ లో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఈరోజు నంద్యాల పట్టణంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ. నాగరాజు గారు జిల్లా నాయకులు శ్రీనివాసులు వి. బాల వెంకట్ పాల డైరీ యూనియన్ నాయకులు సుబ్బయ్య లు మాట్లాడుతూ పాల డైరీలో పనిచేసే కార్మికులను అన్యాయంగా తొలగించడమే కాకుండా బెదిరించడం దుర్మార్గమైన చర్య అని కార్మికులను, అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోకుంటే సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు, చర్చల పేరుతో కాలయాపన చేయడం తప్ప ఏమాత్రం సమస్యను పరిష్కరించే దిశగా యజమాన్యం పూనుకోవట్లేదని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ చెప్పినా కూడా విజయ పాల డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి గారు మోనార్కుల వ్యవహరిస్తున్నాడని అన్నారు విజయ పాల డైరీ ని ప్రైవేట్ పరం చేసి అందులో పని చేసే 200 మంది కార్మికులు, ఉద్యోగులు కడుపు కొట్టి రోడ్డున పడేసే విధంగా పాల డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారని పాల డైరీ ప్రైవేట్ పరం చేస్తే సిఐటియు గా చూస్తూ ఊరుకోమని నంద్యాల ప్రజలను, కార్మికులను, ఉద్యోగులను ఏకం చేసి ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఇప్పటికే నంద్యాల సుగర్ ఫ్యాక్టరీ, నంద్యాల నూలు మిల్లు మూతపడ్డాయని అందులో పని చేసే వందలాది మంది కార్మికులు ఈరోజు రోడ్డున పడి అవస్థలు ఎదుర్కొంటున్నారని అన్నారు, నంద్యాల పాల డైరీ ని కూడా ప్రైవేట్ పరం చేసి అందులో ఉన్న స్థలాలను అమ్ముకోవడానికి పాల డైరీ చైర్మన్ ఎస్ వి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని అందుకనే కార్మికులు యూనియన్లు పెట్టడాన్ని జీర్ణించుకోలేక కార్మికులను తొలగిస్తున్నాడని దీనికి వ్యతిరేకంగా నంద్యాల పట్టణంలోని ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించాలని వారు అన్నారు ఈ సమావేశంలో ప్రసాదు, నాగరాజు, కరుణాకర్, శేఖర్, కలందర్, ఇస్సాకు, సుబ్బరాయుడు రవి, తదితరులు పాల్గొన్నారు.

About Author