NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న వంట కుక్,హెల్పర్స్ కు వర్క్ షాప్

1 min read

డాక్టర్:బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నవంట కుక్,హెల్పర్స్, కేర్ టేకర్స్ కు ఒకరోజు వర్క్ షాపు నిర్వహణ 

సెక్రెటరీ వి.ప్రసన్న వెంకటేష్ ఐఏ ఎస్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 11 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న వంట కుక్,హెల్పర్స్ మరియు కేర్ టేకర్స్ కు 7.05.2026 గురువార నాడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్  డాక్టర్  డోల బాల వీరాంజనేయులు స్వామి వారి ఆదేశాల ప్రకారం, సెక్రెటరీ వి.ప్రసన్న వెంకటేష్ ఐఏ ఎస్ వారి ఆధ్వర్యంలో విజయవాడ జడే సూట్స్ హోటల్ నందు టాటా ట్రస్ట్ మరియు విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ విజయవాడ వారి ద్వారా ఒకరోజు వర్క్ షాపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 40 మంది వంట కుక్ లకు, హెల్పర్స్  మరియు 11 పాఠశాలల కేర్ టేకర్ లకు, ఏ విధంగా వంట చేయాలి, ఎలా పరిశుభ్రంగా వంట చేయాలి, విద్యార్థులకు ఆరోగ్య రక్షణ ఇచ్చే ఆహారాలు ఎలా వండాలి మరియు ఇతర అంశాలు మీద ఈరోజు వర్క్ షాప్ జరిగినది. ఈ వర్క్ షాప్ అడిషనల్ సెక్రటరీ ఏ పి ఎస్ డబ్ల్యు ఆర్ ఇ ఐ ఎస్, రాజ్యలక్ష్మి మరియు డాక్టర్:రాజేష్  పరిశీలన చేసి ఉన్నారు. ఈ విషయం యన్. భారతి, డిస్టిక్ కో-ఆర్డినేటర్  ఏ పి ఎస్ డబ్ల్యు ఆర్ ఇ ఐ ఎస్, ఏలూరు మరియు పశ్చిమగోదావరి జిల్లా వారు ఒక ప్రకటనలో తెలియజేసారు.

About Author