NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారతీయ ప్రతిభావంతులైన యువతుల కోసం గ్లోబల్ ఆడిషన్స్

1 min read

హైదరాబాద్‌లో మే 16 నుండి మే 24 వరకు ఇనార్బిట్ మాల్‌లోని శాంసంగ్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లో ఆడిషన్స్

హైదరాబాద్​, న్యూస్​ నేడు :  శామ్‌సంగ్ ఇండియా, తన ‘షో దెమ్ హౌ ఇట్స్ డన్ #withGalaxy’ కార్యక్రమాన్ని HYBE ఇండియా భాగస్వామ్యంతో ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ఆడిషన్ల వేదికగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతమైన మహిళలకు తమ సామర్థ్యాలను ప్రదర్శించేందుకు ఒక నేషనల్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తూ, వారి సాధికారతను ప్రోత్సహిస్తుంది.ప్రచార కార్యక్రమంలో భాగంగా, శామ్‌సంగ్ ఇండియా దేశవ్యాప్తంగా 10 నగరాల్లో ‘గెలాక్సీ ఆడిషన్ స్టూడియోలు’ను ప్రారంభించనుంది. ఎంపిక చేసిన శామ్‌సంగ్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లను ఆడిషన్లు మరియు కంటెంట్ సృష్టి కేంద్రాలుగా మారుస్తుంది. ప్రతి నగరంలో ఆడిషన్ల తొలి రోజున సృష్టికర్తల ఆధ్వర్యంలో మాస్టర్‌క్లాసులు నిర్వహించి, పాల్గొనేవారు తమ కథలను సృజనాత్మకంగా రూపొందించి, ప్రదర్శించి, పంచుకునేలా ప్రోత్సహించనున్నారు.హైదరాబాద్‌లో మే 16 నుండి మే 24 వరకు ఇనార్బిట్ మాల్‌లోని శాంసంగ్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లో ఆడిషన్స్ నిర్వహణ, దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో ఉన్న శాంసంగ్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లో ప్రత్యేక “గెలాక్సీ ఆడిషన్ స్టూడియోస్” ఏర్పాటు చేయనున్నారు.ఏప్రిల్ 25న ప్రారంభమై మే 3 వరకు కొనసాగుతున్న గౌహతి దశ ఇప్పటికే జీఎస్ రోడ్‌లోని శామ్‌సంగ్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లో విశేష స్పందనను అందుకుంది. రిహార్సల్ కార్యకలాపాలు, వాయిస్ రికార్డింగ్ నుండి ఆడిషన్ వీడియోల చిత్రీకరణ వరకు ప్రతి దశలో శామ్‌సంగ్ గ్యాలక్సీ S26 అల్ట్రా కీలక పాత్ర పోషిస్తోంది. ఇది పాల్గొనేవారికి తమ ప్రతిభను మెరుగైన రీతిలో ప్రదర్శించి, వారి కలలను నిజం చేసుకునే అవకాశాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

About Author