NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రపంచ అయోడిన్  లోప రుగ్మతల వారోత్సవాల బ్రోచర్ ను ఆవిష్కరణ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్.భాస్కర్  ప్రోగ్రాం అధికారులతో  ప్రపంచ అయోడిన్  లోప రుగ్మతల వారోత్సవాల సందర్భంగా బ్రోచర్ ను ఆవిష్కరించినారు,అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ    శరీరంలో అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ వస్తుందన్నారు,  అయోడిన్ లోపం వలన  మెడవాపు  వస్తుందని , అయోడిన్ ( ఉప్పు) త్వరగా అవిరి అయ్యే లక్షణం ఉంటుంది, ఎoడ వేడిమి లేదా గాలి తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి,  దానిని గాలి చొరబడని మూత ఉన్న  డబ్బాలలో  నిలువ చేయాలని తెలిపారు, మనుషుల శారీరక పెరుగుదలకు మరియు అభివృద్ధికి ,మానసిక వృద్ధికి , గర్భస్థ పిండం,చిన్న పిల్లల్లో మెదడు ఏదుగుదలకు , పిల్లల్లో తెలివి తేటలకు అయోడిన్ ఏoతో ముఖ్యం అని తెలిపారు. గర్భవతులు తీసుకొనే ఆహారంలో అయోడిన్ లేకపోతే ,మంద బుద్ధి కలిగిన లేదా వినికిడి లోపం,మూగతనం వంటి సమస్యలు ఉన్న పిల్లలు పుట్టవచ్చును,,కొన్ని సార్లు గర్భస్రావం కూడా అవుతుంది, ముఖ్యంగా గర్భవతులు,చిన్న పిల్లలు తప్పకుండ అయోడిన్ ఉన్న ఉప్పునే వాడాలి అని తెలియజేశారు. ముఖ్యంగా ప్రతి రోజు థైరాయిడ్ మాత్ర క్రమం తప్పకుండ వేసుకోవాలి, ప్రతి రోజు ఉదయాన్నే మాత్ర వేసుకున్నాక 30 నిమిషాల వరకు ఎటువంటి ఆహారము తీసుకోకూడదు, టీ,పాలు ,కాఫీ తీసుకోకూడదు, ఎలాంటివి తీసుకున్న ట్యాబ్లెట్  పూర్తిగా వంటపట్టదు, దాని ప్రభావం సంపూర్ణంగా ఉండదు, థైరాయిడ్ గ్రంధి పనితీరుని ఇబ్బంది పెట్టె  క్యాబేజీ, క్యాలిఫ్లౌవర్, పాలకూర, ముల్లంగి,సోయబీన్స్ ఆహార పదార్థాలను తగ్గించాలి అని తెలిపారు.       ఈ కార్యక్రమములో వ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్.ఉమా, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్.మహేశ్వరప్రసాద్ ,సంచార చికిత్స కార్యక్రమ నోడల్ అధికారి డాక్టర్.రఘు, పరిపాలన అధికారి అరుణ, , ఫ్లోరోసిస్ కన్సల్టెంట్  .సుధాకర్ మరియు ప్రొజెక్షనిస్ట్  S.ఖలీల్ పాల్గొన్నారు.జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి.

About Author