మొంతా తుఫాన్ ప్రభావం వల్ల పెన్షన్ సదరం అపీల్ పున:పరిశీలన వాయిదా
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఎన్టీఆర్ భరోసా పింఛను పథకము ద్వారా సామాజిక భద్రత పింఛన్ల వికలాంగుల పెన్షన్ సదరం అపీల్ పునఃపరిశీలన చేయటానికి తేది: 29.10.2025 నుండి 31.10.2025 వరకు హాస్పటల్ కు వెళ్ళవలసినదిగా ఇదివరకే నోటీసులు ఇవ్వడం జరిగినది. అయితే, మొంతా తుఫాన్ ప్రభావం వల్ల పెన్షన్ సదరం అపీల్ పున:పరిశీలన వాయిదా వేయడం జరిగినది. మరియు పునఃపరిశీలన తేది మండల /సచివాలయ సిబ్బందిల ద్వారా పెన్షనుకు నోటీసులు జారీ చేయబడుతాయి. కావున పైన తెలిపిన తారీఖులలో పెన్షన్లు లబ్దిదారులు ఎవరు కూడ హాస్పటల్ కు వెళ్ళవద్దనని తెలియజేయడమైనది. ఈ విషయపై సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులు తగు చర్యలు తీసుకుని క్రిందిస్థాయి సచివాలయ సిబ్బంది ద్వారా డిసబుల్డ్ పింఛనుదారులకు తగు చర్య తీసుకోవాలి.జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ : వై. పి రమణ రెడ్డి .

