PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జె.వి.ఆర్ స్కూల్ లో వరల్డ్ దోమల దినోత్సవ కార్యక్రమం..

1 min read

– కార్యక్రమంలో పాల్గొన్న డిఎం అండ్ హెచ్ ఓ బి ఆశ

 – నిత్యం పరిసర పరిశుభ్రత ప్రధాన ధ్యేయం..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  మానవాలిని మలేరియా బారినుండి రక్షించిన మహానీయుడు సర్ రోనాల్డ్ రాస్ అనే బ్రిటిష్ వైద్యుడు అని  ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి ఆశ కొనియాడారు.ప్రపంచ దోమల దినోత్సవ సందర్భంగా స్థానిక ఏలూరు సెంట్ జేవియర్ బాలురు ఉన్నత పాఠశాల విద్యార్థులకు దోమల ద్వారా వచ్చే వ్యాధుల పైన,దోమలు నిర్మూలన  గూర్చి అవగాహన కల్పిస్తూ1897 ఆగస్టు 20వ తేదీన ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం  ద్వారా మనుషులకు మలేరియా జ్వరం  సంక్రమిస్తుందని నిరూపించడం ద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి ఆశ సూచించారు, అలాగే డెంగు  కారక దోమ ఇడీస్ ఈజిప్టు, మలేరియా కారక దోమ ఆడనాఫిలిస్ మంచినీటి నిల్వ ప్రాంతాలలో పెరుగుతాయని, దోమ కాటు నుండి మనల్ని మనం సంరక్షించుకోవాలని, డెంగ్యూ దోమ పగటిపూట కుడుతుందని, మలేరియా డెంగు రహిత సమాజమే మన లక్ష్యమని విద్యార్థులు పరిసరాల  పరిశుభ్రత పాటించుటలో కీలక భాగస్వామి కావాలని, వారానికి ఒకసారి ఫ్రైడే డ్రై డే పాటించాలని సూచించారు. అదేవిధంగా  అసిస్టెంట్ మలేరియా అధికారి జె.  గోవిందరావు మాట్లాడుతూ దోమలు మానవాళికి పెనుముప్పుగా మారాయని ఆడ అనాఫిలాస్ దోమ కుట్టడం వలన  మలేరియా జ్వరం, ఎడిస్  దోమ కుట్టడం వల్ల డెంగ్యూ,చికెన్ గునియా, జికా జ్వరాలు, ఆడపిల్ల క్యూలెక్స్ దోమ  వలన బోదకాలు మెదడువాపు సంక్రమిస్తాయని ప్రపంచంలో ఎక్కువ వ్యాధులు దోమ కుట్టడం వల్ల సంభవిస్తాయని కాబట్టి దోమల నిర్మూలన అందరి బాధ్యతగా సామాజిక బాధ్యతగా భావించి దోమ నిర్మల సహకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో నరసింహారావు పేట అర్బన్ ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి  డాక్టర్ అమర్, సి సి ది ఎం ఎం హెచ్ ఓ బసవరాజు, ఎం పి హెచ్ ఇ ఓ రవికుమార్, ఎం పి హెచ్ ఎస్  నాగమల్లేశ్వరావు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ , రమేష్, ఎ ఎన్ ఎం మరియు ఆశా కార్యకర్తలు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author