విశ్వ యోగ గురు ప్రధాని మోడీ సే యోగాంద్ర ప్రారంభం …
1 min read
యోగ శక్తి సాధనా సమితి :డాక్టర్ మాకాల సత్యనారాయణ
విజయవాడ , న్యూస్ నేడు : ప్రపంచ ప్రజల ఆరోగ్యం గాడి తప్పి వింత పోకడలకు దారితీస్తున్న తరుణంలో గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశం లో డాక్టర్ మాకాల. సత్యనారాయణ మాట్లాడుతూ భారత ప్రధాని మోడీ తన అనుభవంతో భారత వారసత్వ ఆరోగ్య సంపద యోగ ప్రపంచానికి అందించే లాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ ) ను ఒప్పించి విశ్వవ్యాప్తం చేసినందుకు అందరూ ఆయనకి రుణపడి ఉండాల ని రోగాలు,రుగ్మతలు,క్యాన్సర్లు,సర్జరీలు, ట్రాన్స్ప్లాంటేషన్ మరియు అర్దంతర చావులు పెరిగిన ఈ తరుణంలో ముఖ్యంగా కరోనా సమయంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తన ఫిట్నెస్ మంత్రా తో ఇచ్చిన వీడియో ప్రపంచవ్యాప్తంగా మరణాలు తగ్గించడానికి దోహద పడిందని అలాంటి వ్యక్తి ‘నభూతూ నా భవిష్యత్తు ‘ అని అలాంటి ఫిట్నెస్ మంత్ర గురించి అంతర్జాతీయ యోగ దినోత్సవంలో భాగంగా 21 రోజుల అవగాహన సదస్సులు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ‘యోగాంద్ర ‘ప్రజారోగ్య పథకం పేరుతో ప్రారంభించి, మోడీ తోనే ప్రారంభించాలని నిర్ణయించడం ఆంధ్రుల అదృష్టం.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తో అద్భుత రాజధాని అమరావతి, ‘యోగాంద్ర పథకంతో దేశంలో ఖ్యాతి గడించడం చరిత్రలో నిలిచిపోతారని అలాంటి ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.యోగాంద్ర పథకానికి యోగ శక్తి సాధన సమితి పూర్తిస్థాయి మద్దతు అందించనున్నట్లు వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమం నందు సంఘ కార్యదర్శి కొండవీటి సుమతి,ఎస్పా భారత్ ఉపాధ్యక్షుడు భూతపాటి ఉదయ్ కుమార్,ముంజంపల్లి శివకుమార్,సయ్యద్ అశ్రపున్నిస,కార్యదర్శి నారగాని ప్రసాద్, అబ్దుల్ రబ్,ఫిజియో డాక్టర్ గోపి సుధ, రామరాజు, విఠల్ వగైరా తెరపిస్టులు పాల్గొన్నారు.సెల్ :9000347369.