వైసీపీకి పొత్తు అవసరం లేదు !
1 min read
పల్లెవెలుగువెబ్ : వైసీపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఓటమి భయంతో.. ఎవరికైతే ప్రజల మద్దతు లేదనుకుంటున్నారో.. వాళ్లే పొత్తుల కోసం చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారాయన. ‘‘చంద్రబాబుకు ఎన్నికలలో గెలుస్తామన్న నమ్మకం లేదు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. అసలు ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత లేదు. పైగా బాబుది దుర్మార్గపు ఆలోచన. ఎప్పుడూ ఇతరులపైనే ఆధారపడే తత్వం. పైగా వెన్నుపోటు పొడుస్తాడు’’ అంటూ వ్యాఖ్యానించారు.