NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మూడవరోజు కొనసాగిన  వైసిపి రిలే నిరాహార దీక్షలు 

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  డీఎస్సీ అక్రమాలపై సిబిఐ చేత విచారణ చేయాలని వైయస్సార్సీపి ఆధ్వర్యంలో పత్తికొండలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడవరోజు కొనసాగాయి. గత మూడు రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను శనివారం పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ , తుగ్గలి, మద్దికెర మండలాల నాయకులతో కలిసి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  మాట్లాడుతూ.. డీఎస్సీలో జరిగిన మోసాలను, అక్రమాలను గత మూడు రోజులుగా ప్రజలకు వివరిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టామని తెలిపారు. ఈ దీక్షలకు సంఘీభావం తెలిపిన సీపీఐ, ఏఐవైఎఫ్, న్యాయవాదులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.డీఎస్సీలో జరిగిన అక్రమాలను ప్రజలకు వివరించామని, నిరుద్యోగ యువతీ యువకులకు న్యాయం జరిగే వరకు వారి తరఫున నిరంతరం పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజా ఉద్యమాలు చేపట్టి, నిరుద్యోగ యువతీ యువకులకు వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.సోమవారం నిర్వహించనున్న భారీ ర్యాలీలో నిరుద్యోగ యువతీ యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మా దగ్గర మండలం  వైఎస్ఆర్సిపి నాయకులు భరత్ కుమార్ రెడ్డి, స్థానిక నాయకులు శ్రీరంగడు, దాసు తదితరులు పాల్గొన్నారు.

About Author