NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆరోగ్యానికి యోగా దివ్యౌషధం

1 min read

 నగరపాలక మేనేజర్ యన్.చిన్నరాముడు

కర్నూలు మున్సిపల్​, న్యూస్​ నేడు :సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సాధన దివ్య ఔషధమని నగరపాలక మేనేజర్ యన్.చిన్నరాముడు తెలిపారు. మంగళవారం బిర్లా కాంపౌండ్‌లోని ఖానా-ఖజానా వద్ద ‘స్ట్రీట్ యోగా’ కార్యక్రమానికి‌ ఆయన హాజరై, ఆసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యంగా జీవించడానికి యోగాసనాలను నిత్యం ఆచరించాలన్నారు. ప్రజలకు యోగాపై మరింత అవగాహన కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. నగరంలో ప్రతి సచివాలయ పరిధిలో ఉచిత యోగ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, నగర ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కోచ్‌లు అవినాష్ శెట్టి, మునిస్వామి, అక్షర, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *