NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యోగశక్తి దేహానికి అద్భుత వైద్యశక్తి 

1 min read

– విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని  

– డాక్టర్ మాకాలసత్యనారాయణకి ఘన సన్మానం

పల్లెవెలుగు వెబ్  విజయవాడ : విశ్వానికి -విశ్వశక్తికి” మూలం  మరియు గురువులకు ఆది గురువు విశ్వకర్మ   అని విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని అశోక్ నగర్ లోని ప్రాణ శక్తి కేంద్రం నందు మాకాల సత్యనారాయణ ని ఘనంగా సన్మానించారు మాకాల మాట్లాడుతూ దేహంలోనే అద్భుతమైన వైద్య శక్తి ఉందని మందులు వాడకుండా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కొద్దిపాటి శిక్షణతో ఎవరికి వారే స్వయంగా స్వల్ప అనారోగ్య సమస్యలను నయం చేసుకోదగిన యోగశక్తి చికిత్స భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని యోగశక్తి చికిత్స రూపకర్త డాక్టర్ మాకాల సత్యనారాయణ అన్నారు.  విశ్వకర్మ జయంతి రోజున ఎందరినో ప్రాణాలు కాపాడిన యోగ శక్తి గురువు డాక్టర్ మాకాల గురువు ని సన్మానించుకోవటం ఎంతో ఆనందదాయకమని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముంజంపల్లి శివకుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో పోలంకి వరదరాజులు, సులోచన మరియు అంబటి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.

About Author