బండి ఆత్మకూరులో …యోగా శిక్షణ తరగతులు
1 min read
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు , న్యూస్ నేడు: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బండి ఆత్మకూరులోని లక్ష్మీ జనార్ధన స్వామి దేవాలయంలో బుధవారం యోగా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణలో ప్రతిరోజు 120 నుండి 130 మంది సచివాల సిబ్బంది ఆశ వర్కర్లు యోగ పైన శిక్షణ ఇస్తున్నారు. యోగ పై ప్రజలకు అవగాహన ఏర్పడేందుకు వీలుగా యోగాలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు నాగేశ్వరరావు, చరితలు అభ్యాసకులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న జరిగే యోగా కార్యక్రమానికి ఈ అవగాహన సదస్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్న ఉద్దేశంతో ఈ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తూ ఉన్నారు ఈ శిక్షణలో ఐదు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని శిక్షణ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ శిక్షణలో యోగాసనాలు ప్రాణాయామము ధ్యాన పద్ధతులను నిర్వహిస్తున్నారు. ఈ యోగాసనాల వల్ల శారీరక మానసిక ఆరోగ్యం సిద్ధించడంతోపాటు, ఒత్తిడిని జయించడం జరుగుతుందని వివిధ రకాల రుగ్మతలను దూరం చేసుకునే అవకాశం ఉంటుందని శిక్షకులు పేర్కొంటున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వైద్యాధికారులు భావన సబిత, ఆయుర్వేద వైద్యాధికారి నాగరాజు, తాసిల్దార్ పద్మావతమ్మ ఎంపీడీవో దస్తగిరి, తో పాటు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
