ముఖ్యమంత్రి పై యువకుడి దాడి !
1 min readపల్లెవెలుగువెబ్ : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భక్తియార్పూర్ పర్యటనలో ఉన్న నితీశ్‌ను లక్ష్యంగా చేసుకున్న యువకుడు సెక్యూరిటీని దాటుకుని వెళ్లి మరీ దాడి చేశాడు. బిత్తరపోయిన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకునేందుకు యత్నించారు. అయినా యువకుడు వినకుండా సెక్యూరిటీని తోసుకుని వెళ్లి దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.