యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు పుట్టినరోజు వేడుకలు
1 min read
కడప, న్యూస్ నేడు: కడప సినీ నటుడు, గ్లోబల్ స్టార్ నందమూరి తారక రామారావు, జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను కడప నగరం ఎర్రముక్కపల్లి నవజీవన్ నిరాశ్రయుల వసతి గృహం నందు మంగళవారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కడప నగరతారక్ ఫ్యాన్స్ అసోసియేషన్ పి, రామారావు యాదవ్, నరేష్, హర్ష, సుబ్బారాయుడు, పెద్ద బుద్ధి వెంకట శివప్రసాద్ ఆధ్వర్యంలో తారక్ 42 పుట్టినరోజు కేక్ కట్ చేసి అనంతరం అల్పాహార కార్యక్రమము చేపట్టడం జరిగింది, ఈ సందర్భంగాతారక్ ఫాన్స్ అసోసియేషన్ పి, రామారావు యాదవ్, మాట్లాడుతూ సినీ ఆకాశంలో ఒక పెద్ద స్టార్ గా వెలుగొందటమే కాకుండా, ఆయన అభిమానులకు కొండంత అండగా నిలబడడం జరిగింది, అందుకే ఆయనను అభిమానులందరూ ముద్దుగా చిన్న రామయ్య, తారక్ అని పిలుచుకుంటారని తాతకు తగ్గ మనవడని, తండ్రికి తగ్గ తనయుడు అని, బాబాయ్ కి తగ్గ అబ్బాయి అని, ముఖ్యంగా ఆయన రాజకీయ విస్ఫోటనమని ఆయన తెలియజేశారు తారక్ ఫ్యాన్స్ యూత్ నరేష్, హర్ష, పెద్ద బుద్ధి శివ సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రపంచం మొత్తం తన నటన వైపు చూసేలా తన నటన ప్రతిభను యావత్ ప్రపంచానికి చూపిన గ్లోబల్ స్టార్ నందమూరి తారక రామారావు అని ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ పది కాలాలపాటు చల్లగా ఉండాలని అభిమానులు అందరము కూడా ఆ దేవుని ప్రార్థిస్తున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, విక్రమ్, బ్రహ్మయ్య, అనూష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.