స్పీకర్ కు వైఎస్ సునీత లేఖ !
1 min readపల్లెవెలుగువెబ్ : మాజీ మంత్రి, దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తన తండ్రి హత్య కేసులో ఎంపీ అవినాష్ హస్తం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని స్పీకర్‌ను సునీత కోరారు. సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని లేఖకు జతపరిచారు. అలాగే సీబీఐకి నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్‌కు వైఎస్ సునీత అందజేశారు.