ప్రతి అక్క ప్రతి చెల్లికి ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా వైయస్సార్ ఆసరా
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణం GMR ఫంక్షన్ హాల్ అవరణం లో వైయస్సార్ ఆసరా పథకం మూడో విడత కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి గారు ఎమ్మెల్యే సతీమణి కాటసాని జయమ్మ గారు వైయస్సార్ పార్టీ యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి కాటసాని ప్రసాద్ రెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేసి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి ఎమ్మెల్యే కారుసాన్ని రామిరెడ్డి పొదుపు మహిళా సంఘం మహిళలు పాలాభిషేకం నిర్వహించారు.అనంతరం పొదుపు మహిళా సంఘాల సభ్యులకు మెగా చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగిందని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పేదల బతుకులు ఎలా బాగుపడతాయి వారిని ఆర్థికంగా ఎలా పైకి తీసుకురావాలని లక్ష్యంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. కరోనా కష్టకాలంలో ఎంతోమంది ఉపాధి అవకాశాలు కోల్పోవడమే కాకుండా ప్రాణాలను సైతం పోగొట్టుకోవడం జరిగిందని అలాంటి ఆపత్కాలంలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో మనం దోపిడీలకు పాల్పడకుండా మనం ఉన్నంతవరకే మన కుటుంబాలను జీవనం చేసుకుందామని ఒకవేళ జగనన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు మనకు లబ్ధి చేకూరాకుండా ఉంటే ఎన్నో దోపిడీలు దొంగతనాలు మన ఆంధ్రప్రదేశ్లో జరిగేటివి అని తెలిపారు. గత తెలుగుదేశ ప్రభుత్వంలో ఒక పింఛన్ రావాలన్నా ఒక ప్రభుత్వ సంక్షేమ పథకం రావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వండి అందేటివి కాదని నేడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించడం జరిగిందని చెప్పారు. నేడు వృద్ధులకు వితంతువులకు ఇంటి వద్దకే వాలంటరీ వ్యవస్థ ద్వారా పింఛన్లను అందించడం జరుగుతుందని అదే తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఆటోలకు డబ్బులు పెట్టుకుని రెండు మూడు రోజులపాటు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడికాపులు కాచి కళ్ళు తిరిగి కిందపడిపోయే వారిని ఒకసారి అవన్నీ గుర్తు చేసుకోవాలని చెప్పారు. మరి జగనన్న పరిపాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మన ఇంటి వద్దకే చేరుతున్నాయో అర్థం చేసుకొని వచ్చే ఎన్నికల్లో తన నాన్నగారు కాటసాని రామిరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నకు కానుకగా అందించాలని ప్రతి అక్కకు ప్రతి చెల్లభంకు ప్రతి అవ్వకు కాటసాని ఓబుల్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బనగానపల్లెఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి సతీమణి కాటసాని జయమ్మ మాట్లాడుతూ వైయస్సార్ ఆసరా పథకం మహిళలకు సంబంధించిన కార్యక్రమమని కాబట్టి ఒక మహిళగా ఈ కార్యక్రమానికి హాజరయ్యి జగనన్న అందిస్తున్నటువంటి పథకాలను నియోజకవర్గ మహిళల ప్రజలకందరికీ తెలియజేయాల్సిన బాధ్యత కాటసాని జయమ్మ గారి మీద ఉందని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలియజేయడంతో తన ఈ కార్యక్రమానికి హాజరయ్యానని చెప్పారు. జగనన్న అధికారంలోకి చేపట్టిన తర్వాత మహిళలకు ఆర్థికంగా స్వావలమ్మనంగా అభివృద్ధి చెందాలని దిశతో ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళలకు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే మన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి అవ్వ అండగా ఉండి తన చేస్తున్నటువంటి అభివృద్ధికి మీ సహాయ సహకారాలు అందించి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఆయన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అహర్నిశలు నియోజకవర్గఅభివృద్ధికోసంపాటుపడుతున్నాడని అలాగే ఆయన కుమారుడు కూడా కాటసాని ఓబుల్ రెడ్డి కూడా నిత్యం ప్రజాసేవకు అంకితమై ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలు కూడా తన కుమారుడు కారసాన్ని ఓబుల్ రెడ్డి గారికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ నాడు ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలను తెలుసుకోవాలని స్వయంగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3,648 కిలోమీటర్లు ఎండనక, వాననక మండుటెండల్లో సైతం పాదయాత్ర నిర్వహించి ఆ పాదయాత్రలో ప్రజల కష్ట,సుఖాలను స్వయంగా తెలుసుకున్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సగర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పారు. అలాంటి నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్ గా, ఒక బైబిల్ గా భావించి ఆ హామీలు అన్నింటిని ఇప్పటికే 98% మేరా నెరవేర్చడం జరిగిందని చెప్పారు. నవరత్నాలు అనే పథకం ద్వారా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటరీలతో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో బ్యాంకుల్లో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి ఇలా కమిటీల పేరుతో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే వారి నుంచి లంచాలు తీసుకుని అవినీతికి పాల్పడినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ ది అని చెప్పారు. బనగానపల్లె పేద ప్రజలకు 3000 ఇంటి స్థలాలు ఇస్తుంటే చూసి ఓర్వలేని టిడిపి మాజీ శాసనసభ్యుడు బీసీ జనార్దన్ రెడ్డి కోర్టుకు వెళ్లి పేదలకు ఇంటి స్థలాలు రాకుండా చేసినటువంటి ఘనత బీసీకి దక్కుతుందని చెప్పారు. కొలిమిగుండ్ల మండలంలో పేదలకు భూ పంపిణీ కార్యక్రమం చేపడుతుంటే ఎక్కడ కాటసాని రామిరెడ్డి కి పేరు వస్తుందని హైకోర్టుకు వెళ్లి అడ్డుపడ్డ నీచ సంస్కృతి బీసీ జనార్దన్ రెడ్డి ది అని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. పేద పిల్లలకు కార్పొరేట్ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాడు నేడు అనే మహత్తర పథకం ద్వారా అన్ని మౌలిక వసతులు కల్పించడమే కాకుండా పేద విద్యార్థులకు సైతం ఇంగ్లీష్ విద్యను అందించాలనే లక్ష్యంతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంజరిగిందనిఅంతేకాకుండా ఎంతో ఖరీదైనటువంటి సీబీఎస్ఈ సిలబస్ ను కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పారు. అలాగే నాడు నేడు ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రులను అన్ని మౌలిక వసతులు కల్పించాలని లక్ష్యంతో నేడు బనగానపల్లె పట్టణంలో 50 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా 23 కోట్లరూపాయలతో అధునాతనంగా భవన నిర్మాణం పూర్తి అయిందని చెప్పారు. అలాగే రైతులకు రైతు భరోసా అనే కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వ వాటాతో కలిపి 13,500 నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే పేద విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారం అందించాలని లక్ష్యంతో మధ్యాహ్నం భోజనంలో మెనూ మార్చి ప్రతిరోజు పౌష్టికాహారం ఇచ్చేటట్లు వైయస్ జగన్ అన్న చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. కరోనా కష్టకాలంలో ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి మన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలిపారు. ఎన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ చూసి ఓర్వలేని టిడిపి పార్టీ నాయకులు వైయస్సార్ పార్టీ మీద అభినందన వేయడం మంచి పద్ధతి కాదని వైయస్సార్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో టిడిపి పార్టీ నాయకులు,కార్యకర్తలు సైతం పథకాలు తీసుకున్నటువంటి ఘన చరిత్ర ఉందని చెప్పారు. ప్రభుత్వం అంటే ఏ ఒక్క పార్టీకి చెందినది కాదని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అనే నినాదం తో ముందుకు వెళుతున్న మహానీయుడు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ కావడం జరుగుతుందని చెప్పారు. ఇన్ని సంక్షేమ పథకాల అందిస్తున్న మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడం జరిగిందని కాబట్టి ఇన్ని సంక్షేమ ఫలాలు అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే తమ ఓటు అనే ఆయుధంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,వైయస్సార్ పార్టీ అభ్యర్థులను అఖండమెజార్టీతోగెలిపించాలనిచెప్పారు.ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి సతీమణి కాటసాని జయమ్మ గారు, బనగానపల్లె నియోజకవర్గ వైయస్సార్ పార్టీ యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి ,నియోజకవర్గ వైయస్సార్ పార్టీ నాయకులు కాటసాని ప్రసాద్ రెడ్డి,అవుకు మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరు పాల్ రెడ్డి, బనగానపల్లె మండల వైయస్సార్ పార్టీ నాయకులు గుండం శేషి రెడ్డి,జిల్లా వైయస్సార్ పార్టీ యువజన సంఘం అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి,రాష్ట్ర కుర్ని సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ మెటికల శ్యామలా దేవి,వైయస్సార్ పార్టీ మైనారిటీ నాయకుడు అత్తా ర్ జాహీద్ హుస్సేన్,అబ్దుల్ ఫైజ్,డాక్టర్ మహమ్మద్ హుస్సేన్,ఎంపీపీ మానస వీణ, జెడ్పీటీసీ సుబ్బా లక్ష్మమ్మ,బనగానపల్లె సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ,వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండల అభివృద్ధి అధికారి శివ రామయ్య,వెలుగు సీసీ తిరుపాల్ రెడ్డి, అధికారులు,మండల అధికారులు, పొదుపు మహిళా సంఘాల సభ్యురాళ్లు, పొదుపు మహిళలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.