ఏలూరు జిల్లాలో వై.ఎస్.ఆర్ కళ్యాణమస్తు
1 min read– వై.ఎస్.ఆర్. షాదీతోఫా ద్వారా 169 మందికి రూ. 145.30 లక్షలు మంజూరు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి గౌరవ ప్రధంగా వారి వివాహాన్ని జరిపించి తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించేందుకు ఎస్సీ, ఎస్టీ, బి.సి., మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వై.ఎస్.ఆర్. ‘’కళ్యాణమస్తు’’ ద్వారా ముస్లీం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వై.ఎస్.ఆర్. ‘’షాదీతోఫా ’’ ద్వారా ఆర్ధిక సాయం అందించడం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి జిల్లాల వారీగా వారి ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించడం జరిగింది. ఏలూరు జిల్లాలో ఈ పథకం కింద అక్టోబరు 1, 2022 తర్వాత జరిగిన వివాహాలకు 240 మంది నమోదు చేసుకోగా 169 మంది లబ్దిదారులకు రూ. 145.30 లక్షలు మంజూరు చేయడం జరిగింది. వీటిలో కులాంతర వివాహాం కింద 28 మంది దంపతులకు రూ. 27.30 లక్షలు, మైనార్టీలు ఇద్దరుకు రూ. 2 లక్షలు, ఒకే కులానికి చెందిన 139 మంది దంపతులకు రూ. 116 లక్షలు మంజూరు కాబడినవి. ఈ పథకం కింద ఎస్సీ కులాల ఆడ పిల్లలకు లక్ష రూపాయలు, ఎస్సీ(కులాంతర వివాహానికి) లక్షా 20 వేలు రూపాయలు, ఎస్టీ కులానికి లక్ష రుపాయలు, ఎస్టీ కులాంతర వివాహాలకు లక్షా 20 వేలు రూపాయలు, బిసి కులానికి 50 వేలు రూపాయలు, బిసి కులాంతర వివాహానికి 75 వేలు రూపాయలు, మైనారిటీలకు లక్ష రూపాయలు, విభిన్న ప్రతిభావంతులకు లక్షా యాభైవేలు రూపాయులు, ఇతర భవన నిర్మాణ కార్మికుల ఆడి పిల్లలకు 40 వేలు రూపాయలు ఈ పథకం ద్వారా అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం లబ్దిదారులకు రూ. 1,45,30,000 ల చెక్కును డిఆర్ డిఏ పిడి విజయరాజు, సోషల్ వెల్పేర్ జేడి మధుసూధనరావు, బి.సి. వెల్పేర్ ఆఫీసరు ఆర్.వి. నాగరాణి, జిల్లా మైనారిటీస్ వెల్పేర్ ఆఫీసరు ఎన్.ఎస్. కృపావరం కలిసి లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.