NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ క్రీడాకారునికి “సాయం”అందించిన యువ స్పందన సేవా సంస్థ 

1 min read

సాయం అందించేందుకు ముందుకు వచ్చిన రామాంజనేయులు 

పత్తికొండ, న్యూస్​ నేడు:  జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు బైరిగడ్డ.వీరేష్ అనే యువకునికి పత్తికొండ యువ స్పందన సొసైటీ సౌజన్యo తో ఆర్థిక సాయం అందించారు. శనివారం సాయంత్రం పత్తికొండ పట్టణంలోని యువ స్పందన స్టడీ సర్కిల్ యందు ప్రభుత్వ జూనియర్ కళాశాల సీనియర్ ఆధ్యాపకులు వీరేశప్ప, సొసైటీ అధ్యక్షులు సురేంద్ర, సభ్యులు క్రీడాకారుడు బైరిగడ్డ వీరేష్ అనే క్రీడాకారునికి 15000 రూ.లు ఆర్థిక సాయం కింద నగదును అందజేశారు. వెనుకబడిన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వీరేష్ వెయిట్ లిఫ్టింగ్ జాతీయస్థాయిలో స్థాయిలో రాణించడం మన ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారుడు వీరేష్ ఆర్థికంగా సహాయం కావాలని పత్తికొండ యువ స్పందన సొసైటీని సంప్రదించారని తెలిపారు. వెంటనే సొసైటీ సభ్యులు, పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి ఆసీస్, ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత రామాంజనేయులు ను సంప్రదించగా, వారు ముందుకు వచ్చి 15000 రూ.లు  ఆర్థిక సాయం చేశారని పేర్కొన్నారు. అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ అధ్యాపకులు వీరేశప్ప క్రీడాకారునికి 1000 రూపాయలు సహాయం చేశారు. క్రీడాకారుడు వీరేష్ కి ఇంకా ఏవైనా సహాయ, సహకారాలు అందిస్తామని పూర్వ విద్యార్థులు, సొసైటీ సభ్యులు తెలిపారు. జనవరి నెలలో  భూపాల్ రాష్ట్రంలో జరిగే సౌజన్ నేషనల్ గేమ్ లో ఆడేందుకుఈ ఆర్థిక సాయం ఉపయోగపడు తుందని క్రీడాకారుడు వీరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు లక్ష్మన్న, సెక్రటరీ నాగరాజు, సభ్యుల గిరీష్, రాజేశ్వరి, స్టడీ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author