బాల్యవివాహాలను అరికడదాం..
1 min read

భారత దేశ అభివృద్ధికి సహకరిద్దాం -నైస్ కంప్యూటర్ అధినేత రాయపాటి శ్రీనివాస్
కర్నూలు, న్యూస్ నేడు: బాల్యవివాహాల అరికట్టి భారతదేశ అభివృద్ధికి సహకరిద్దామని రాయపాటి శ్రీనివాస్ అన్నారు. అన్నారు. శనివారం వెంకటరమణ కాలనీలోని నైస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో కోనేరు ఎన్జీవో ఆధ్వర్యంలో బాల్య వివాహ విముక్తి 100 రోజుల ప్రణాళిక కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ , రాజా రామ్మోహన్ రాయ్ వితంతు వివాహాల ప్రోత్సహించాడన్నారు. చిన్నపిల్లలకి పెళ్లి చేయడం వల్ల భర్త చనిపోతే జీవితాంతం వితంతువుగా ఉండాల్సిన పరిస్థితి ఉండేది అన్నారు. దాంతో 13 ఏళ్ల బాలిక భవిష్యత్తు అంధకారమయ్యేదన్నారు అందుకే కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహాలను నివారించేందుకు బృహత్కర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. బాల్య వివాహాక్విముక్తి 100 కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన అన్నారు. తమ కాళ్ళపై తమ నిలబడాలంటే మంచి చదువులు చదవాలని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. చిన్న చిన్న అవసరాల కోసం, లేదా ఆనందం కోసం ప్రేమ పేరుతో మోసపోవద్దని బాలికలను హెచ్చరించారు. కనీసం డిగ్రీ దాకా చదివి తమ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కోనేరు ఎన్జీవో సిఎస్ఎం చిన్న రామాంజనేయులు మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల తమ భవిష్యత్తు కాకుండా పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అవుతుందన్నారు. 18 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకుంటే బాలిక ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా గర్భవతి అయితే గర్భంలోనే శిశు మరణించే అవకాశం ఉందన్నారు. ఒకవేళ జన్మించిన అంగవైకల్యం లేదా బుద్ధి మాంద్యంతో జన్మించే అవకాశం ఉందన్నారు. బాల్యవివాహాలు వ్యతిరేకించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. బాల్య వివాహాలు చేసుకుంటే ఎన్నో నష్టాలు ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు పాల్గొన్నారు.

