క్రాఫ్ట్ బజార్ ను ప్రారంభించిన జడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్
1 min readహస్త కళలను ఆదరించి, చేనేత కార్మికులకు చేదోడుగా ఉండాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరులో స్థానిక కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న టిటిడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ అతిథిగా పాల్గొని బుధవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఏలూరు నగర పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగపడే విధంగా ఈ క్రాఫ్ట్ బజార్ ఉందని . ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వివిధ పథకాల ద్వారా హస్తకాలను ఆదరించే విధంగా చేనేత కార్మికులకు చేదోడుగా నిలిచారని. అదేవిధంగా చేనేత కార్మికులకు చేయూతనిచ్చే కార్యక్రమాన్ని ఏలూరులో ప్రారంభించినందుకు నిర్వహికులను అభినందించారు.అనంతరం వివిధ స్టాల్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర,హస్తకళ వస్తువులను సందర్శించడం జరిగింది. క్రాఫ్ట్ బజార్ నిర్వాహకులు శ్రీనివాస్ మాట్లాడుతూ క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకొని బుధవారం నుండి 45 రోజులు పాటు ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సందర్శకుల నిమిత్తం తెరిచి ఉంటుందని. వివిధ రాష్ట్రాల నుండి ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర హస్తకళ కాది వస్త్రాలు, బెంగాలీ కాటన్ చీరలు, సింగపూర్ వుడ్ ఐటమ్స్, జైపూర్ బెడ్ షీట్స్, కాశ్మీర్ టాప్స్, రెడీమేడ్ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని మ్యానుఫ్యాక్చర్ రేట్లకు అమ్మకానికి కలవని ఈ సదా అవకాశాన్ని ఏలూరు నగర పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.