వసతి గృహాలలో.. దరఖాస్తు చేసిన విద్యార్థులకు సీటు ఇవ్వాలి
1 min read– వసతి గృహాలకు సన్న బియ్యం సరఫరా చేయాలి
– కొత్త విద్యార్థుల కోసం వసతిగృహాల్లో సీట్లను పెంచాలి
వసతి గృహాలలో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి హాస్టల్ సీటు ఇవ్వాలని, వసతి గృహాలకు సన్న బియ్యం సరఫరా చేయాలని బీసీ, ఎస్సీ వసతిగృహాల ఎన్ఎస్ యూఐ రాష్ట్ర కన్వీనర్ వీరేష్ యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం కర్నూల్లో ఎస్సి, బిసి సాంఘిక సంక్షేమ అధికారులు రమాదేవి , గూడుబాయిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరేష్ మాట్లాడుతూ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 ను తక్షణమే రద్దు చేయాలని ,రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలను నాడు-నేడు పథకం ద్వారా అభివృద్ధి చేసిన విధంగానే వసతి గృహాలను కూడా అభివృద్ధి చేయాలని కోరారు. అంతేకాక వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని, అద్దె భవనాల్లో ఉన్న వసతి గృహాలకు అద్దెలు చెల్లించి ప్రభుత్వ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని, వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, వసతి గృహాలలో ప్రతివారం ప్రభుత్వ అధికారులు బస చేసి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని కోరారు. ప్రతి మండలానికి ,ప్రతి నియోజకవర్గంలో వసతి గృహాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. మహిళా వసతి గృహాలు పెంచెలా కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్యు ఐ జిల్లా నాయకులు మహేశ్వర య, అశోక్ కుమార్, అజయ్ నాయుడు పాల్గొన్నారు.