చంద్రబాబు అపద్దపు హమీలు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి
1 min read

లోకేష్ పాదయాత్ర హమీలకు పసలేకుండా పోయింది.
నిరుద్యోగులను మోసం చేసిన కూటమి సర్కార్
మహేంద్ర నాయుడు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు.
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్రంలోని నిరుద్యోగులను కూటమి సర్కార్ నిలువునా మోసం చేసిందని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేంద్ర నాయుడు కూటం ప్రభుత్వాన్ని విమర్శించారు. మంగళవారం కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మహేంద్ర నాయుడు మాట్లాడుతూ డియస్సి పేరుతో 24 వేలకు పైగ ఖాళీగా ఉంటే 16 వేలు పోస్టులు భర్తీ చేసి మిగతా పోస్టులకు మెుండి చేయ్యి చూపింది అలగే యూనివర్శిటీల్లో, మెడికల్ కలలెజీల్లో, లైబ్రెరిలో, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో సంవత్సరాలుగ ఖాళీగ ఉన్నాయి ఆ ఉద్యోగల భర్తీ పై ఎటువంటి ఆలోచన చేయ్యడం లేదన్నారు. 2014-19 లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగులకు భృతి ఇస్తామంటూ ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. వారి పార్టీలోని రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే భృతి కల్పించి, నిరుద్యోగులను మోసం చేశారు. తిరిగి తాజా ఎన్నికల్లో కూటమి పార్టీలను గెలిపిస్తే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు, నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామంటూ ఆశలు కల్పించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు దీనిపై బడ్జెట్‌లో కనీస కేటాయింపులు కూడా చేయ లేదు? ప్రతిసారీ గత ప్రభుత్వం అప్పులు చేయ్యాడం వల్లనే ఎవరికి న్యాయం చేయలేక పోతున్నామంటూ చంద్రబాబు పదేపదే అబద్దాలు చెప్పి అందరి చెవుల్లో పూలు పెడుతున్నారు.అధికారంలోకి రాకముందు పవన్ కల్యాణ్ ఎగిరేగిరి గంతులేసిన వ్యక్తీ నేడు నిరుద్యోగులకు న్యాయం చేయ్యటంలో మెసం చేశారు.అధికారమే లక్ష్యం జరిగిన లోకేష్ పాద యాత్ర పనికిరాని యాత్రగ చరిత్రలో మిగిలిపోతుంది.ఎన్నికల నాడు ఇచ్చిన హామీలను అమలు చేయ్యకుండ చంద్రబాబు మెసం వల్లే నేడు ప్రజలు, నిరుద్యోగులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి.భవిష్యత్ లో యూత్ కాంగ్రెస్ అన్ని వర్గాలకు అండగ ఉంటు పోరాటం చేస్తూంది.ఈ కార్యక్రమంలో ఎస్సి సెల్ జిల్లా చైర్మెన్ ఎన్ సి బజారన్న , ఓబిసి జిల్లా చైర్మెన్ డివి సాంబశివుడు, మైనారిటీ సెల్ జిల్లా చైర్మెన్ షేక్ ఖాజా హుస్సేన్, యూత్ కాంగ్రెస్ నాయకులు వెంకట్, ఆశోక్, రాజు, మహేష్, వంశి, నంద తదితరులు పాల్గొన్నారు.

