NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వ్యవసాయ రంగంలో డ్రోన్‌ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి

1 min read

2 లక్షల ఎకరాల భూములు సాగులోకి తెచ్చేందుకు రైతులను ప్రోత్సహించండి

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు: డ్రోన్‌ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో వ్యవసాయంలో కిసాన్ డ్రోన్స్ వినియోగంపై గ్రూప్ కన్వీనర్, కో-కన్వీనర్, అధికారులు, ఎఫ్పిఓలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఎల్డిఎం రవీందర్ కుమార్, ఆర్ఆర్ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా.రామకృష్ణా రావు, నాబార్డు డిడిఎం, డ్రోన్ నిర్వాహకులు చైతన్య, రైతులు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.నానో యూరియా వినియోగం ద్వారా పెట్టుబడి తగ్గి దిగుబడి పెరగడం వల్ల డ్రోన్స్ వినియోగం పెరిగే అవకాశం ఉంటుందన్నారు. పొలాల్లో మోతాదుకు మించి రసాయనాలు వాడటం ద్వారా మైక్రో న్యూట్రియెంట్స్ తగ్గి భూమి నిస్సారవంతం అవుతుందన్నారు. భూమిలో కార్బన్ కంటెంట్ 3% కంటే తక్కువగా ఉందని… భూమి సారాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పంటలకు అవసరం వున్నా, లేకున్నా తడి ఇవ్వడం ద్వారా సూక్ష్మ పోషకాలు తగ్గి పంట దిగుబడి తగ్గుతోందని… వీటి నివారణ కోసం డ్రోన్స్ సరైన పరిష్కారమన్నారు. జిల్లాలో సుమారుగు 2 లక్షల ఎకరాల వరకు ఒకే పంట వేసి పంట పొలాలను బీడు భూములుగా వుంచకుండా వాటిలో వ్యవసాయ, ఉద్యానవన పంటలైన నువ్వులు, బ్లాక్ గ్రామ్, సోయా, కొర్ర తదితర పంటలు వేసేలా రైతులను ప్రోత్సాహించాలన్నారు.డ్రోన్స్ కు పొలాల దగ్గర ఛార్జింగ్ పెట్టుకునే అవకాశంతో పాటు డ్రోన్స్ ట్యాంకు సామర్థ్యాన్ని పెంచేలా చూడాలని డ్రోగో నిర్వాహకులను కలెక్టర్ కోరారు. అదే విధంగా ఈ డ్రోన్ లో ఎటువంటి సాంకేతిక సాయం కోసం టోల్ ఫ్రీ నెం.9294892948 ను సంప్రదించాలన్నారు. నంద్యాల పట్టణం కోవెలకుంట్ల రోడ్ లో ఉన్న డ్రోన్ సర్వీసు సెంటర్ షాపు నెం.14,15 ఆర్.ఆర్.ఆర్. రెస్టారెంట్ దగ్గర, రైతునగర్ లో వున్న సర్వీస్ సెంటర్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.  అంతకుముందు జిల్లా వ్యవసాయ అధికారి, నాబార్డు డిడిఎం, ఎల్డిఎం, డ్రోన్ సంస్థ నిర్వాహకులు కిసాన్ డ్రోన్స్ సాంకేతిక వినియోగం, ఉపయోగాలు, బ్యాంకు రుణం తదితర అంశాలపై వ్యవసాయ అధికారులు, రైతులకు అవగాహన కల్పించారు.

About Author