జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి
1 min read

వార్తా కథనాలపై వెంటనే స్పందించాలి
ప్రతి రోజు ఆర్డీవో లు, ఎంపిడిఓ లు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజనీర్లు సమీక్ష చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లాలో తాగునీటి సరఫరా అంశంపై ఆర్డీవో లు, ఎంపిడిఓ లు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజనీర్లు,మున్సిపల్ కమిషనర్ లు, ఈ వో ఆర్డీ లు తదితరులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటికి సంబంధించి ఇది కీలకమైన సమయం అని, జూలై మాసం వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి, జిల్లాలో ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పత్రికల్లో తాగునీటి సమస్యలకు సంబంధించి వచ్చే కథనాల పై వెంటనే స్పందించి, వాటిని పరిష్కరించి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.. ప్రతి రోజు ఆర్డీవో లు, ఎంపిడిఓ లు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజనీర్లు, ఈవో పీఆర్డీ లు సమీక్ష చేసుకోవాలన్నారు..రక్షిత మంచినీటి పథకాలు, ట్యాంకులు, ఫిల్టర్లు, పంపిణీ వ్యవస్థ సరిగా ఉందో లేదో చూసుకోవాలన్నారు.. పంచాయతీ,మండల పరిషత్ , జిల్లా పరిషత్ నిధులను వినియోగించుకునిఅవసరమైన వాటికి వెంటనే మరమ్మతులు చేయాలన్నారు..ఇంకా నిధులు అవసరం అయితే ప్రభుత్వానికి రాయాలని అధికారులకు సూచించారు..కోడ్ఆలూరు, ఆస్పరి, తుగ్గలి, మంత్రాలయం, గోనెగండ్ల, కౌతాళం, ఎమ్మిగనూరు, నందవరం, కోసిగి, హోళగుంద తదితర మండలాల్లో తాగునీటి ఇబ్బందులపై వచ్చిన కథనాల గురించి అధికారులతో ఆరా తీశారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులను పరిష్కరించారా అని ఎంపిడిఓ లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ప్రశ్నించారు..ఆయా మండలాల్లో తీసుకున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.సబ్ కలెక్టర్, ఆర్డీవోల తో మాట్లాడుతూ ఆయా డివిజన్ లలో నీటి సమస్యలపై ప్రతి రోజు సంబంధిత అధికారులతో సమీక్ష చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. వార్తా కథనాలు, కంట్రోల్ రూమ్ ద్వారా వచ్చే ఫోన్ కాల్స్ పై వెంటనే స్పందించి అధికారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు..అవసరమైన చోట నీటిని ట్రాన్స్పోర్టేషన్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.పట్టణ ప్రాంతాలలో నీటి సమస్య గురించి కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ లను అడిగి తెలుసుకున్నారు..వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ లను ఆదేశించారు.. కర్నూలు లో ఎస్ ఎస్ ట్యాంక్, సుంకేసుల రిజర్వాయర్ లో పూర్తి సామర్థ్యంతో నీటి నిల్వ ఉండడం వల్ల తాగునీటికి ఇబ్బంది లేదని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు వివరించారు.. అలాగే ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు లో కూడా నీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయా పట్టణాల మున్సిపల్ కమిషనర్ లు వివరించారు. గాజులదిన్నె రిజర్వాయర్, ఎల్ ఎల్ సి ల గురించి ఇరిగేషన్ ఎస్ ఈని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో తాగునీటి ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖల అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.టెలి కాన్ఫరెన్స్లో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కర్నూలు ఆర్డిఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ నాగేశ్వరరావు,ఇరిగేషన్ ఎస్ ఈ బాలచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

