రైతుల నుంచి ఇంతవరకు 1.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
1 min read
ధాన్యం సేకరణ 2.20 లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు
ఓపెన్ మార్కెట్ నందు 677 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
రైతు సేవాకేంద్రాల్లో అధనంగా 11,82,696 గోనె సంచులు అందుబాటు
జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : రైతుల నుంచి ఇంతవరకు 1.84 లక్షల మెట్రిక్ టన్నుల రభీ ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లాజాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు. బుధవారం స్ధానిక జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో రభీ ధాన్యం కొనుగోలు, సిఎంఆర్ రైస్ పై రైస్ మిల్లుల యాజమాన్యాలతో, పౌర సరఫరాల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ రబీ 2024-25 రైతుల నుండి ధాన్యం సేకరణలోభాగంగా తొలుత 1.50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని నిర్ధేశించారని, అయితే జిల్లా యంత్రాంగం వారి సూచనల మేరకు ధాన్యం దిగుబడి ఎక్కువ వున్నందున జిల్లా టార్గెట్ ని 2.00 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం జరిగిందన్నారు. తదుపరి జిల్లా వ్యవసాయ అధికారి, ఏలూరు వారి నివేదిక ప్రకారం ధాన్యం దిగుబడి ఎక్కువ వున్నందున జిల్లా యంత్రాంగం మరో 20 వేల మెట్రిక్ టన్నులకు అధనపు లక్ష్యాన్ని కేటాయించడం జరిగిందన్నారు. దీంతో ఏలూరు జిల్లా యొక్క లక్ష్యం 2.00 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2.20 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించడం జరిగిందన్నారు. రైతులు కోరిక మేరకు పెంచిన లక్ష్యనికి అనగా ప్రస్తుతానికి 0.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను 9,00,000 గోనె సంచులను అవసరమై వుందన్నారు. కానీ రైతు సేవాకేంద్రాల వద్ద అదనంగా 11,82,696 గోనె సంచులు రైతులకు అందుబాటులో వుంచడం జరిగిందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు తగిన ఏర్పాట్లు జిల్లా యంత్రాగం చేసివుందని, దానికి గాను టార్పాన్లు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.జిల్లా యొక్క టార్గెట్ లో సిఎంఆర్ రైస్ ను 15,000 మెట్రిక్ టన్నులను ఎఫ్ సిఐ గోడౌన్ కు, మిగిలిన 1,32,400 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ రైస్ ను సివిల్ సప్లైయిస్ కార్పోరేషన్ గోడౌన్ లకు తరలించాలన్నారు. ప్రభుత్వం వారు నిర్ణయించిన సమయంలో అందించిన ఎడల సదరు రైస్ మిల్లుల యాజమాన్యం పై క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల మేనేజరు పిఎస్ఆర్ మూర్తి, డిఎస్ఓ ప్రతాప్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకిదేవి, పలువురు రైస్ మిల్లుల అసోషియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
