NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నగర ప్రజలకు మంచినీటి అందించే ట్రీట్మెంట్ ప్లాంట్ల పరిశీలన

1 min read

కో-ఆప్షన్ సభ్యులు ఎస్ యం ఆర్ పెదబాబు, కమిషనర్ భాను ప్రతాప్

మనిషికి 135 లీటర్లు చొప్పున 36ఎమ్ ఎల్ డి వాటర్ నగరవాసులకు అందిస్తున్నారు

సమస్యలను గుర్తించి ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి పరిష్కరిస్తాం

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఏలూరు నగర ప్రజలకు మంచినీటినీ అందించే  రెండు ట్రీట్మెంట్ ప్లాంట్లను కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు,కమిషనర్ ఏ.భాను ప్రతాప్ బుధవారం సాయంత్రం పరిశీలించారు.  ఈ సందర్భంగా ఎస్ ఎమ్ ఆర్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు పంపులు చెరువు ప్రాంగణంలో 30 ఎంఎల్డి, 8 ఎంఎల్డి రెండు ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయన్నారు. దెందులూరులో ఉన్న గోదావరి జలాల చెరువు నుండి వచ్చిన రా వాటర్  ప్యూరిఫై చేసి నగరంలో ఉన్న జనాభా లెక్క ప్రకారం ప్రతిరోజు మనిషికి 135 లీటర్లు చొప్పున 36 ఎం ఎల్ డి వాటర్ ను నగర ప్రజలకుఅందిస్తున్నామన్నారు.అయితే ట్రీట్మెంట్ ప్లాంట్ పనితీరు,క్లోరినేషన్ ప్రక్రియ,ఫిల్టర్ బెడ్స్ క్లీనింగ్, వేస్ట్ వాటర్ వెళ్లే విధానాన్ని పరిశీలించామని పెదబాబు అన్నారు,అయితే అక్కడ జంగిల్ ఎక్కువగా పెరిగిపోవడం,స్టాఫ్ రూమ్ పాడైపోవడం,వేస్ట్ వాటర్ వెళ్లే డ్రైనేజీ పాడైపోవడం మొదలగు సమస్యలు గుర్తించామని తక్షణమే ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి వాటిని పరిష్కరించుతామని ఎస్ ఎమ్ ఆర్ పెదబాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎం.ఈ సురేంద్రబాబు,ఎలక్ట్రికల్ డి ఈ నారాయణ, ఏఈ సాంబశివరావు,ఫిల్టర్ బెడ్ ఆపరేటర్ పవన్ తదితరులు ఉన్నారు.

About Author