NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్డిటి పై కేంద్రం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలి

1 min read

మంత్రాలయం న్యూస్​ నేడు :  ఎస్సి ఎస్టి వెనుకబడిన ప్రజల కు ఆర్డిటి సంస్థ చేస్తున్న కార్యక్రమాల పై కేంద్రం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని సిడిసి సూగురు ఉపసర్పంచ్ గర్జి గోపినాథ్, మహిళలు కోరారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో ఫాదర్ విన్సెట్ ఫెర్రర్ వర్ధంతి సందర్భంగా రాఘవేంద్ర సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఆర్డిటి సంస్థ చేసే కార్యక్రమాల పైన కేంద్ర ప్రభుత్వం ఎఫ్ సిఆర్ఏ రెన్యువల్ నిలిపివేయడం జరిగిందని తెలిపారు. దీనిని రెన్యువల్ కొరకు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి చేరే దాకా శాంతియుతా ర్యాలీ చేయడం జరిగిందని తెలిపారు. కేంద్రం వెంటనే ఆంక్షలను యెత్తివేసి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపినాథ్ సమృద్ధి పురుషోత్తం బాలరాజు వీరేష్ నాయక్ నారా నాయక్ శంకర్ నాయక్, మహిళలు పాల్గొన్నారు.

About Author