50 దళిత కుటుంబాలు వెలి !
1 min readపల్లెవెలుగువెబ్ : జార్ఖండ్ లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కులానికి చెందిన 50 దళిత కుటుంబాలను కొందరు ఊరిలో నుంచి తరిమేశారు. ఈ దళిత కుటుంబాల ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇళ్లలోని వస్తువుల అన్నింటినీ వాహనాల్లోకి ఎక్కించి, వీరిని సమీప అడవిలోకి తరిమేశారు. జార్ఖండ్‌లోని పలామూ జిల్లాలోని మరుమటు గ్రామంలో ఈ వివక్షాపూరిత ఘటన జరిగింది. ఘటనపై రాష్ట్ర గవర్నర్ రమేశ్ స్పందించారు. రెండ్రోజుల్లో నివేదిక సమర్పించాలని పలాము డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు.