ప్రతి ఒక్క చిన్నారికి విద్యా హక్కు కల్పించడం మన బాధ్యత
1 min read
– లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
కర్నూలు, న్యూస్ నేడు: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, అసోసియేషన్ అఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 117,నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో అసోసియేషన్ అఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 117 గవర్నర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఆడుక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముందు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 117 గవర్నర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి విద్య ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో మౌలానా అబుల్ కలాం ఆజాద్ విశేష కృషి చేశారని తెలిపారరిటైర్డ్ తహసిల్దార్ లయన్ బిఏ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలకు అనుగుణంగా విద్యావంతమైన, సమానత్వం కలిగిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఉపాధ్యక్షులు లయన్ కేడీజే బాబు మాట్లాడుతూ మంచి ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు పొందాలంటే తప్పనిసరిగా కమ్యూనికేషన్స్ స్కిల్స్ కలిగి ఉండాలని కన్మ్యూనికేషన్ స్కిల్స్ పైన ఆన్ జాబు ట్రైనింగ్ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.


