జిల్లా ఎస్పీ కి పి జి ఆర్ ఎస్ లో 88 ఫిర్యాదులు
1 min read
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యా లయంలో సోమవారం నిర్వ హించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భాగంగా మొత్తం 88 ఫిర్యాదుల అందాయి. వాటిలో భూ వివాదాలు 39, కుటుంబ వివాదాలు 16, ఆర్థిక వివాదాలు 12, పరిపాలనా సంబంధిత సమస్యలు 8, మోసాలు 6, న్యూసెన్స్ 3, ఇతర సమస్యలు 3, వేధింపులు 1 చొప్పున ఉన్నాయి.భూకబ్జాలు, వడ్డీ వేధింపులపై తక్షణమే కఠిన చర్యలు తీసు కోవాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.బాధితులకు సత్వర న్యాయం అందించా లని, సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చ రించారు.ఈ ఫిర్యాదులపై విచారణను వేగంగా పూర్తిచేసి, సంబంధిత నివేదికలను వెంటనే జిల్లా ప్రధాన కార్యాల యానికి పంపాలని ఎస్పీ స్పష్టం చేశారు.


