మిడుతూరు మండలానికి 95 పింఛన్లు మంజూరు..
1 min read
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండలానికి నూతనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు 95 మంజూరు అయ్యాయని ఎంపీడీఓ పి.దశరథ రామయ్య తెలిపారు.01.12.2023 నుండి 31.10.2024 వరకు భర్తకు పెన్షన్ వస్తూ మరణించిన భర్త..వారి భార్యకు వితంతు పెన్షన్ మంజూరు కొరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.గ్రామాల వారీగా మంజూరు అయిన పింఛన్ల వివరాలు:చెరుకుచెర్ల-4,చింతలపల్లి-8,చౌట్కూరు-3,49 బన్నూరు-4, దేవనూరు-5,కడుమూరు-6,జలకనూరు-4, సుంకేసుల-2,మాసపేట-2,ఉప్పలదడియ-2, కలమందల పాడు-2,మిడుతూరు-19,పీరు సాహెబ్ పేట-6,నాగలూటి-6,పైపాలెం-3,అలగనూరు-2,రోళ్ళపాడు-6,తలముడిపి-7,తిమ్మాపురం-4, బైరాపురం-1,వీపనగండ్ల-4,మంజూరు అయిన పింఛన్ లబ్ధిదారులు తమ ఆధార్, రేషన్,బ్యాంక్ అకౌంట్,భర్త మరణ ధ్రువీకరణ పత్రం అను వాటిని సచివాలయాల్లో అందజేయాలని ఎంపీడీవో అన్నారు.